Posts

Relaxing Music and Smooth Music

Relaxing and Beautiful smooth music.. Please see these links.. Videos https://youtu.be/ZbZ5CqeO8zE https://youtu.be/_AtUlnJgM8k https://youtu.be/xEY18FPhu1Q https://youtu.be/kHgwm1UfqBc https://youtu.be/ybCpQJWvOyo https://youtu.be/L1oFj4dPLHU https://youtu.be/KDl1Dtp8lOI https://youtu.be/TtDsStBAh3Y https://youtu.be/hSg0kPGFf5s https://youtu.be/V1o8pXZFedA https://youtu.be/9ieJ-ngy-0g https://youtu.be/hTjD44lYuU4 https://youtu.be/EQXXlyQvw6w https://youtu.be/GoeKQKg6lp4

ఎంత డబ్బు ఉన్న మన బ్రతుకులు ఇంతే... Steve Jobs Golden words

Image
Steve Jobs Golden words స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.  నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కార...

మనిషి పుట్టిన వెంటనే ఎందుకు మాట్లాడలేడు???

Image
మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు? శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి. అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు.  ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.

మనకు వాసన ఎలా తెలుస్తుంది? How do we recognize smell?

Image
వాసన పసిగట్టేదేలా ? ✳ఏదైనా పదార్ధం వాసన తెలియాలంటే దాని నుంచి వెలువడే కొన్ని అణువులు మన ముక్కును చేరుకోవాలి . బ్రెడ్ ,ఉల్లిపాయలు , ఫేర్ఫ్యుములు ,పౌడర్లు , పండ్లు , పూలు లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే వాటి నుండి అతి తేలికైన అణువులు ఆవిరై .. గాలిలో ప్రయాణించి మన ముక్కును చేరుకుంటాయి. ఉక్కు ముక్క వాసన వేయడు ... కారణం దానినుంచి ఆవిరయ్యే పదార్ధం అంటూ ఏదీ ఉండదు . ముక్కులో ఉండే నాసికారంద్రాల పైభాగం లో పోస్టల్ స్టాంపు పరిమాణము లో ఉండే మచ్చలాంటి ప్రదేశం లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు (neurons)ఉంటాయి .. వాటిపై 'సీలియా' (celia)అనే వెంట్రుకల లాంటి విక్షేపాలు (projections) వాసనకు సంభందించిన అణువులను బంధించి నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి.మెదడు సాయముతో మనము వాసలను పోల్చుకోగాలుగుటాము. మానవులు పదివేల రకాల వాసనలను సంబందిత న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు . ఇలా ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ గ్రాహకాలలో కొన్నింటికి ఒక నిర్దిష్టమైన జీన్-కోడ్ (సంకేతం ) ఉంటుంది . ఆ కోడ్ లోపించిన లేక దానికి హాని జరిగినా , ఆ వ్యక్తి ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు . ఒక పండు లేక పుష్పము వాసనను పసిగడుతున్నామంటే వ...

ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?

Image
ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు? ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి.  పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.

టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి?

Image
టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి? సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ ఇన్‌ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు.  ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.

పాములకు నిజంగా తలలో మణి ఉంటుందా..అపోహ??

Image
నాగు పాముల విషం కాలక్రమేణా మణిగా మారుతుందని చెబుతారు, నిజమేనా? పాములు మణులను సృష్టించలేవు. నాగమణులంటూ ఎక్కడా లేవు. పాములు విషం గట్టిపడి అదే మణిగా మారుతుందనడం కూడా నిజం కాదు. పాములకు సంబంధించినన్ని మూఢనమ్మకాలు ఇన్నీ అన్నీ కావు. పాములు పగపడతాయని అనుకుంటారు. అది తప్పు. పాములు నాగస్వరాన్ని వింటూ ఆడతాయంటారు. ఇదీ నిజం కాదు. పాములకు చెవులు లేవు. పాములు పాలు తాగడం కూడా నిజం కాదు. అలాగే జర్రిపోతు మగపామే కానక్కర లేదు. అలాగే పాములన్నీ విషపూరితం కూడా కావు