జీవితం రూపాయితో ముడి, value of money, value of perfect life
ఓసారి రెండువేల రూపాయల నోటు, ఒక్క రూపాయి నాణెం ఒకే పర్సులోకి చేరాయి. ఈ రెండిటి సంభాషణ. రూపాయి నాణెం రెండు వేల నోటుతో కలిసిన తన్మయత్వం తో కూడిన ఆనందంలో అలాగే చూస్తూ ఉండి పోయింది. దాంతో రెండు వేల నోట్.... రూపాయి నాణెంతో ఇలా అంది ఏంటి మిత్రమా నన్ను అంతలా తదేకంగా చూస్తున్నావ్? అని..... అప్పుడు రూపాయి నాణెం అంది ఏమీలేదు మిత్రమా! నీ విలువ నాకంటే రెండువేలరెట్లు ఎక్కువ కదా! నీవు నీజీవితకాలంలో ఎంతో మంది కష్టాలు తీర్చి కన్నీళ్లు తుడ్చి ఉంటావు. ఎంతో మంది ఆకలి తీర్చి ఆదుకొని ఉంటావు అని అందుకే అలా చూస్తున్నా...... దానికి రెండు వేల నోటు బాధ పడుతూ లేదు మిత్రమా ఎవ్వరి కన్నీళ్లు తుడిచి.... కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం రాలేదు. ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి ఇంట్లో ఉంటిని వాడు నన్ను తన లాకర్ లో దాచాడు. టాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత ఈమధ్య జరిగిన ఐటీ దాడులలో నేను బయటకు వచ్చాను. జైల్లో నుండి బయటపడిన ఆనందం కాస్తా కొన్ని రోజులు కూడా లేదు. ఐటీ దాడులలో పట్టు బడిన సొమ్ము లో నుండి లంచం రూపంలో ఐటీ అధికారికి ఇచ్చారు. లంచం తీసుకున్న అధికారి నన్ను మళ్ళీ బ్యాంక్ లాకర్ లో పడేస్తే కొన్ని రోజుల తరువాత బయట కొచ్చినా...