ఇక (100) వంద రూపాయల నోటు లేనట్లేనా RBI Desition

ఇక (100) వంద రూపాయల నోటు లేనట్లేనా!!!

పాత తరం 100 రూపాయల నోట్లకు  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI  ) ఈ సంవత్సరం ( 2021) లో సెలవు పలకనుంది . దేశవ్యాప్తంగా కొత్త 100 నోట్లను వాడకంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే,పాత నోట్లకు స్వస్తిచెప్పాలని నిర్వహించినట్లు RBI ఈ రోజు ప్రకటించింది.

మంగళూరు( కర్ణాటక ) లోని దక్షిణ కన్నడ జిల్లా పంచాయతీ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకింగ్ సెక్యూరిటీ కమిటీ క్యాష్ మేనేజ్మెంట్ సబేలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో  RBI అసిస్టెంట్ జనరల్ మేనేజర్  B N మహేష్  పాల్గొన్నారు . గత 6 సంవత్సరాలుగా పాత 100 నోట్లను ముద్రించడం లేదని , దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన మిలియన్ రూపాయల 100 నోట్లను బయటకు తెచ్చే ఉద్దేశంతోనే  ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు . ఎంత డబ్బు కలిగివున్నా మార్చి నెలాఖరు నాటికి అన్ని బ్యాంకులు పాత 100 నోట్లను జమ చేసుకుని , కొత్త 100నోట్లను కస్టమర్లను అందిస్తామని ఆయన అన్నారు .

Comments