Posts

Showing posts from February, 2021

ఎంత డబ్బు ఉన్న మన బ్రతుకులు ఇంతే... Steve Jobs Golden words

Image
Steve Jobs Golden words స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.  నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కార...

మనిషి పుట్టిన వెంటనే ఎందుకు మాట్లాడలేడు???

Image
మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు? శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి. అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు.  ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.

మనకు వాసన ఎలా తెలుస్తుంది? How do we recognize smell?

Image
వాసన పసిగట్టేదేలా ? ✳ఏదైనా పదార్ధం వాసన తెలియాలంటే దాని నుంచి వెలువడే కొన్ని అణువులు మన ముక్కును చేరుకోవాలి . బ్రెడ్ ,ఉల్లిపాయలు , ఫేర్ఫ్యుములు ,పౌడర్లు , పండ్లు , పూలు లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే వాటి నుండి అతి తేలికైన అణువులు ఆవిరై .. గాలిలో ప్రయాణించి మన ముక్కును చేరుకుంటాయి. ఉక్కు ముక్క వాసన వేయడు ... కారణం దానినుంచి ఆవిరయ్యే పదార్ధం అంటూ ఏదీ ఉండదు . ముక్కులో ఉండే నాసికారంద్రాల పైభాగం లో పోస్టల్ స్టాంపు పరిమాణము లో ఉండే మచ్చలాంటి ప్రదేశం లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు (neurons)ఉంటాయి .. వాటిపై 'సీలియా' (celia)అనే వెంట్రుకల లాంటి విక్షేపాలు (projections) వాసనకు సంభందించిన అణువులను బంధించి నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి.మెదడు సాయముతో మనము వాసలను పోల్చుకోగాలుగుటాము. మానవులు పదివేల రకాల వాసనలను సంబందిత న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు . ఇలా ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ గ్రాహకాలలో కొన్నింటికి ఒక నిర్దిష్టమైన జీన్-కోడ్ (సంకేతం ) ఉంటుంది . ఆ కోడ్ లోపించిన లేక దానికి హాని జరిగినా , ఆ వ్యక్తి ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు . ఒక పండు లేక పుష్పము వాసనను పసిగడుతున్నామంటే వ...

ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?

Image
ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు? ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి.  పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.

టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి?

Image
టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి? సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ ఇన్‌ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు.  ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.

పాములకు నిజంగా తలలో మణి ఉంటుందా..అపోహ??

Image
నాగు పాముల విషం కాలక్రమేణా మణిగా మారుతుందని చెబుతారు, నిజమేనా? పాములు మణులను సృష్టించలేవు. నాగమణులంటూ ఎక్కడా లేవు. పాములు విషం గట్టిపడి అదే మణిగా మారుతుందనడం కూడా నిజం కాదు. పాములకు సంబంధించినన్ని మూఢనమ్మకాలు ఇన్నీ అన్నీ కావు. పాములు పగపడతాయని అనుకుంటారు. అది తప్పు. పాములు నాగస్వరాన్ని వింటూ ఆడతాయంటారు. ఇదీ నిజం కాదు. పాములకు చెవులు లేవు. పాములు పాలు తాగడం కూడా నిజం కాదు. అలాగే జర్రిపోతు మగపామే కానక్కర లేదు. అలాగే పాములన్నీ విషపూరితం కూడా కావు

భూమి బంతిలా తిరుగుతుంది.. పడిపోతుందా???

Image
భూమి బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా? బొంగరం కాసేపటికి ఆగిపోయి పక్కకు పడిపోయినట్టే భూమి కూడా పడిపోతుందా??? మొదట భూమి ఎందుకు తిరుగుతోందో తెలుసుకుందాం. పాలపుంతలో నక్షత్రాలు, సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, మన భూమి.. ఇవన్నీ కూడా తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్న వాయు-ధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే.  పరిభ్రమిస్తున్న వాయువుల నుంచి ఏర్పడిన ఏ వస్తువైనా ఆ వాయువుల ధర్మాన్ని కలిగి ఉండాలన్నది ఒక భౌతిక శాస్త్ర నియమం. దీనిని కోణీయ ద్రవ్య వేగ సూత్రం (law of conservation of Angular mimentum) అంటారు. ఈ నియమం ప్రకారమే పాలపుంత, సౌరకుటుంబం కూడా తన చుట్టూ తాను పరిభ్రమించే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే భూమి కూడా రోదసిలో నిరంతరంగా బొంగరంలాగా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు బొంగరం ఎందుకు ఆగిపోతుందో చూద్దాం. బొంగరం తిరిగేప్పుడు దాని చుట్టుపక్కల ఉండే గాలి వల్ల, అది ఆని ఉన్న ఉపరితలం వల్ల కలిగే ఘర్షణలాంటి బలాలు దానిపై పనిచేసి కాసేపటికి వేగం క్షీణించి పక్కకు పడిపోతుంది. అయితే భూమిపై పనిచేయడానికి అలాంటి బలాలేమీ అంతరిక్షంలో లేవు. అంతరిక్షంలో ఉండే ఘర్షణశక్తులు చాలా స్వల్పం (...

భూమి లోపల అమర్చిన లాండ్‌మైన్స్‌ ఉనికిని ఎలా కనిపెడతారు????

Image
భూమి లోపల అమర్చిన లాండ్‌మైన్స్‌ ఉనికిని ఎలా కనిపెడతారు? భూమిని తవ్వి లోపల పేలుడు పదార్థాలను అమర్చి మట్టిని కప్పేయడం వల్ల లాండ్‌మైన్స్‌ (మందుపాతరలు) ఉనికి పైకి తెలియదు. దాని మీంచి బరువైన వాహనాలు ప్రయాణించినప్పుడు ఆ ఒత్తిడికి పేలుతాయి. లేదా వాటిని అమర్చిన దుండగులు రిమోట్‌ కంట్రోలు సాయంతో దూరం నుంచి పేలుస్తుంటారు. మందుపాతరల ఉనికిని కనిపెట్టడం మెటల్‌ డిటెక్టర్ల సాయంతో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాటిలో అమర్చే పేలుడు పదార్థాలను లోహమిశ్రమాలతో కాకుండా కృత్రిమమైన సింథటిక్‌ మెటీరియల్స్‌తో చేస్తారు. అయితే కప్పెట్టిన పేలుడు పదార్థాల పరమాణువులు ఆవిరవుతూ నేలలోని పగుళ్లగుండా బయట వాతావరణంలో కలుస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని కనిపెట్టగలిగే పరికరాలు ఉంటాయి. మానవ శరీరంలోని భాగాలను చిత్రాల ద్వారా తెరపై చూపించే 'న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌' సాధనం ద్వారా మందుపాతరల ఉనికిని చూడవచ్చు. వీటి ద్వారా వెలువడే విద్యుదయస్కాంత తరంగాల సాయంతో పేలుడు పదార్థాల నుంచి వెలువడే అణువులను కనిపెట్టవచ్చు. అలాగే కొన్ని పరికరాల ద్వారా శక్తిమంతమైన శబ్దతరంగాలను భూమి లోపలికి ప్రసరించేలా చేస్తారు. అవి మందుపాతర...

మంచి ఉపాయం

Image
ఒక గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొరుగింట్లో ఉండే సాంబయ్య కోళ్ళ వ్యాపారం చేసేవాడు. సాంబయ్య కోళ్ళు ప్రతిరోజూ రంగయ్య పెరడులోకి వచ్చేవి. రంగయ్య భార్య గింజలు ఎండకు ఆరబోస్తే, కావల సినంత తిని, కాళ్ళతో తొక్కి చెల్లాచెదురు చేసేవి. రంగయ్య రోజూ సాంబయ్యతో కోళ్ళను తన పెరడులోకి తోలవద్దని చెప్పేవాడు.‘‘అవి మనలాగ మనుషులా ఏమిటి? చెప్పిన మాట వినడానికి. మూగప్రాణులయ్యా! ఎటుపడితే అటు వెళ్తుంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ సాంబయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. కొన్నిరోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు సాంబయ్య పొరుగూరు సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంట్లోకి వెళుతూ తన కోళ్ళ కోసం రంగయ్య ఇంటి పెరడులోకి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.రంగయ్య నేల మీద అక్కడక్కడ పడున్న గుడ్లను ఒక బుట్టలోకి ఏరుకుంటున్నాడు. ‘‘రంగయ్యా! నీ దగ్గర కోళ్ళు లేవుగా! మరి ఈ గుడ్లు ఎక్కడివి?’’ అని అడిగాడు సాంబయ్య.‘‘ఇందాక నీ కోళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాయి. బహుశ అవే పెట్టి ఉంటాయి’’ అంటూ అమాయకంగా జవాబు చెప్పి లోపలికి వెళ్ళి పోయాడు రంగయ్య. సాంబయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఇక ఆరోజు నుండి అతను తన కోళ్ళు రంగయ్య పెరడుల...

సముద్రంలోలాగా నదులు, చెరువుల్లో కెరటాలు ఎందుకు రావు?

Image
సముద్రంలోలాగా నదులు, చెరువుల్లో కెరటాలు ఎందుకు రావు? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే, ఎంత జలాశయానికి అంత కెరటాలు అనుకోవచ్చు. నదులు, చెరువులు, సరస్సుల్లో అలలుంటాయి కానీ కెరటాలు ఉండవు. నదులు ప్రవాహ రూపంలో ఉంటాయి కాబట్టి వాటిలోని అలలను మిగతా వాటితో పోల్చలేం. సముద్రాలు, సరస్సులు, చెరువుల్లో ఏర్పడే అలలు ఉష్ణశక్తి సంవహనం (thermal convection), ఉష్ణోగ్రతా దొంతరలు (temperature contours), జలగతిక నియమాల (hydrodynamics) సమష్టి ఫలితంగా ఏర్పడుతాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను స్థూలంగా అర్థం చేసుకుందాం. నీరు అధమ ఉష్ణవాహకం. నేల కన్నా నీటిలో ఉష్ణప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. లోతైన సముద్రప్రాంతం, లేదా చెరువులో మధ్య భాగాలను తీసుకుంటే అక్కడ నీటి ఉష్ణోగ్రత, ఒడ్డున ఉన్న నీటి ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యలోని నీటి నుంచి, ఒడ్డున ఉండే నీటికి ప్రసారమవుతూ ఉంటుంది. ఇలా ప్రసారమయ్యే ప్రక్రియలో పైన చెప్పుకున్న నియమాల ద్వారా నీటి అడుగున అనుదైర్ఘ్య తరంగాలు (longitudinal waves) ఏర్పడుతాయి. చుట్టుపక్కల ఒత్తిడుల వ్యత్యాసాల వల్ల నీరు పైకి ఉబ్బి అలల్లా ఏర్పడుతాయి. వీటిని తిర్యక్‌ తరంగాలు (transvers...

రైలు పట్టాల పక్కన ఈ అల్యూమినియం బాక్స్ ని గమనించారా? అది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసా.?

Image
రైలు పట్టాల పక్కన ఈ అల్యూమినియం బాక్స్ ని గమనించారా? అది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసా.? రైలు ప్రయాణాలు మనకి కొత్తేమి కాదు. ఎంతో హుషారు గా కిటికీ పక్కన కూర్చుని రైల్లో వెళ్ళడానికి మనందరం ఇష్టపడతాం. అదే సమయం లో రైలు పట్టాలకు పక్కాగా ఓ అల్యూమినియం బాక్స్ ఉంటుంది. దీనిని ఎప్పుడైనా గమనించారా..? ఈ బాక్స్ లు ఏమిటి..? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోబో సినిమా చూసాం కదా. అందులో రోబోట్ ట్రైన్ లో ఫైట్ చేస్తున్న సమయం లో ఛార్జ్ అయిపోతుంది. అదే టైం లో రైలు పట్టాల పక్కన పడిపోయిన రోబో అల్యూమినియం బాక్స్ లో నుంచి ఓ వైర్ ను తీసుకుని ఛార్జింగ్ పెట్టుకున్నట్లు చూపిస్తారు. సినిమా కోసం ఈ బాక్స్ ని అలా వాడినప్పటికీ.. అసలు ఈ బాక్స్ లను వేరే అవసరం కోసం పెట్టారు. ఈ అల్యూమినియం బాక్స్ లను ఆక్సిల్ కౌంటర్లు అంటారు. ఇందులో కమ్యూనికేషన్ కేబుల్స్ ఉంటాయి. ఇవి వచ్చి పోయే రైళ్ల సమాచారాన్ని రైల్వే డిపార్ట్మెంట్ కు అందిస్తాయి. రైలు పట్టాలకు పక్కాగా.. ప్రతి ఐదు, ఆరు కిలోమీటర్లకు ఒక చోట ఈ బాక్స్ లను ఏర్పాటు చేస్తారు. వీటిని లొకేషన్ బాక్స్ లు అని కూడా పిలుస్తారు. ఈ బాక్స్ ...

I like these story Inspirational

Image
పోస్ట్ నాకు బాగా నచ్చింది.ఒక్కసారి మీరుకూడా  చదవండి   ఒక సమావేశంలో ఉపన్యాసం సందర్భంగా గురుాజీ* 30 ఏళ్ల వ్యక్తిని నిలబడమని అడిగాడు  మీరు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నడుస్తున్నారు. మీ  ముందు నుండి ఒక అందమైన అమ్మాయి వస్తున్నట్లయితే, మీరు ఏమి చేస్తారు?  ఆ యువకుడు - ఆమెనే చూస్తాను.  గురూజీ అడిగారు - అమ్మాయి ముందుకు కదిలితే, మీరు వెనక్కి తిరిగి చూస్తారా?  యువకుడు - అవును, నా భార్య నా వెంట లేకపోతే.  (సమావేశంలో అందరూ నవ్వారు)  గురు జీ అప్పుడు అడిగాడు - ఆ అందమైన ముఖాన్ని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటారో చెప్పు?   (మరో అందమైన ముఖం కనిపించే వరకు) ఆ యువకుడు 5 - 10 నిమిషాలు అన్నాడు.  గురూజీ ఆ యువకుడితో - ఇప్పుడు ఆలోచించండి...  మీరు భద్రాచలం నుండి హైదరాబాద్ కి వెళుతున్నారు. నేను మీకు ఒక ప్యాకెట్ పుస్తకాలు ఇచ్చి, ఈ ప్యాకెట్‌ను హైదరాబాద్ లోని ఒక గొప్ప వ్యక్తికి అందజేయమని చెప్పాను.  మీరు ప్యాకెట్ డెలివరీ చేయడానికి హైదరాబాద్ లోని అతని ఇంటికి వెళ్లారు.  మీరు అతని ఇంటిని చూసినప్పుడు, అతను పెద్ద బిలియనీర్ అని మీకు తెలిసి...

Just for Fun

Image
అది కాలేజీ మొదటి రోజు...కాలేజీ క్యాంపస్ మొత్తం యువతీ యువకులతో నిండిపోయింది!.. అక్కడ వాతావరణం ఉత్సుకత, ఉల్లాసంతో నిండుగా ఉంది!!... అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి నా దగ్గరకు వచ్చి,"హాయ్!.. నేను హన్సిక, ఫస్ట్ ఇయర్.. మరి మీరు??!!" ఒక్క క్షణకాలం ఏమి చెప్పాలో తెలియలేదు!.. కొద్దిగా నన్ను నేను తమాయించుకొని, "నేను.. మా అబ్బాయి ఫీజు కట్టడానికి వచ్చానమ్మా!" అని నిజం చెప్పాల్సి వచ్చింది! సంతూర్ సబ్బుతో అమ్మేకాదు, మిగిలిన కొంచం సబ్బుతో అప్పుడప్పుడు నాన్న కూడా స్నానం చేస్తాడు!!!

Inspirational story

Image
ఒక మెకానికల్ ఇంజనీర్ కారులో వెళ్తున్నాడు ఉన్నట్టుండి టైర్ పంచర్ అయ్యింది  అటుగా ఎక్కడా ఎవరి రాకపోnకలు లేవు ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు బోల్టులన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ బోల్టులన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయినాయి. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా   మురికి బట్టలు అందులోనూ అక్కడక్కడా చినిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తీ అటుగా వచ్చాడు  ఈయన్ని చూసి అయ్యా ఏమైందని అడిగాడు  అప్పుడు ఆ ఇంజనీర్ కు ఆ కాలువలో దిగడానికి సరైన వ్యక్తి దొరికాడని జరిగిందంతా చెప్పాడు  ఆ కాలువ నుండి బోల్టులు తీసిస్తే ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పాడు  అప్పుడు ఆ వ్యక్తి  అయ్యా!! కాలువలో దిగడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అంతకంటే సులభమైన మార్గం ఉంది. మిగతా మూడు టైర్ ల నుండి ఒక్కో బోల్టు తీసి ఈ టైర్ కు వేయండి తరువాత వచ్చే మెకానిక్ షాప్ లో నాలుగు బోల్టులు తీసి వేసుకుంటే సరిపోతుంది అన్నాడు అంతే..! ఇంత చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదా ? అని ఆశ్చర్యపోయాడు  మనిషిని చూసి తక్కువ అంచనా ...

కొంగలకు కాళ్ళు పొడవుగా ఉంటాయెందుకు ???

Image
కొంగలకు కాళ్ళు పొడవుగా ఉంటాయెందుకు ? కొంగలకు మిగిలిన శరీరము కన్నా కాళ్ళు మూడూ-నాలుగు రెట్లు పొడవుగా ఉంటాయి. మామూలు గా ఇలా పొడవు కాళ్ళు ఉండడము ఆహారము కోసము నీళ్ళలోకి వెళ్ళే పక్షులలో కనిపిస్తుంది. మిగిలిన సమయము నేలమీద , ఆహారము కోసం నీళ్ళలో నడిచే కొంగలు , ప్లెమింగోల వండి వాటికి నీరు శరీరానికి తగలకుండా ఉండేందుకు వాటి కాళ్ళు పొడవుగా ఉంటాయి. పెరిగిన కాళ్ళ రూపానికి తగినట్లే ఈ పక్షులు లలో మెడపొడవు పెరుగుతుంది ... కిందికి వంగి నీటిలోని చేపలను అందుకునేందుకు ఆ మెడ అలా సాగింది.

సింగినాదం జీలకర్ర అని ఎందుకంటారో..మీకు తెలుసా???

Image
సింగినాదం జీలకర్ర అని ఎందుకంటారు ? సింగినాదం జీలకర్ర: ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములొ జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ,ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర వొకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది. ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.

సూర్యుని అంతర్భాగం నుంచి ఎంతో దూరం లో ఉండే చివరి పొర "కరోనా" ఉష్ణోగ్రత ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ?

Image
సూర్యుని అంతర్భాగం నుంచి ఎంతో దూరం లో ఉండే చివరి పొర "కరోనా" ఉష్ణోగ్రత ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ? సూర్యుని ఉపరితలం తో పాటు చుట్టూ ఉండే వాతావరణాన్ని - కాంతి మండలం (Photosphere) , వర్ణ మండలం (Chromosphere) , కాంతి వలయం (Corona) అనే మూడు భాగాలు గా విభజించ వచ్చు . సూర్యుని వాతావరణం లో అట్టడుగున ఉండే కాంతి మండలం ఉష్ణోగ్రత 5500 కేల్విన్లు ఉంటే , వర్ణ మండలం లో ఉష్ణోగ్రత ౪౫౦౦ కేల్విన్ల నుండి 10,000 కేల్విన్లు వరకు ఉంటుంది . ఈ మండలం తన కింద ఉండే కాంతి మండలం లో ఉత్పన్నమైన ఉష్ణం వల్ల వేడెక్కుతుంది .. కరోనా సూర్యుని వాతావరణం లోని చివరి ఉపరితల పొర . దీని ఉష్ణోగ్రత 2,౦౦౦,౦౦౦ .కేల్విన్ల నుండి 5,౦౦౦,౦౦౦ కేల్విన్ల వరకు ఉంటుంది . కరోనా లో ఉష్ణానికి కారణం సూర్యునిలో ఉండే "కరోనియం" అనే మూలకము. కాంతి మండలాన్ని సలసల మరుగుతున్న నీటి ఉపరితలం తో పోల్చవచ్చు . ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రతలో ఉన్న ప్రవాహి ద్రవ్యం (Fluid) పైకి , కిందికి ఎగిసి పడుతూ విపరీతమైన శబ్దం కలిగి ఉంటుంది . ఈ శబ్దతరంగాలు కరోనాలోకి చొచ్చుకొని రావడం తో అక్కడి ఆ ధ్వని శక్తి ఉష్ణ శక్తి గా మారుతుంది . కరోనా లో ఉన్న పదార్ధ...

ఎలక్ట్రిక్ రైల్లో షాక్ కొట్టదు...ఎందుకు???

Image
ఎలక్ట్రిక్ రైల్లో షాక్ కొట్టదు... ఎందుకు??? మనకు షాక్‌ కొట్టాలంటే మన శరీరంలో రెండు ప్రాంతాలు (సాధ్యమైన నిడివి దూరంలో, ఉదా: కాళ్లు ఒక చివర, చేతులు మరో చివర) వేర్వేరు విద్యుత్‌శక్మం(electrical potential) ఉన్న ధ్రువాలను (poles) తాకాలి. అపుడు శరీరం గుండా విద్యుత్‌ ప్రవహించడం వల్ల శరీరంలో అవాంఛనీయమైన ప్రక్రియలు జరిగి షాక్‌ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్‌ రైలులో కేవలం ఇంజన్‌ మాత్రమే ఎలక్ట్రిక్‌ వైర్లకు సంధానిస్తారు. బోగీలను కాదు. అయితే బోగీలకు, ఇంజనుకు మధ్య అనుసంధానం ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా విద్యుత్‌ ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్‌ తీగ ఒకటి మాత్రమే రైలు పైన ఉంటుంది. రెండు ధ్రువం భూమి (ground). ఇది పట్టాల మీదుగా భూమికి సంధానంలో ఉంది. విద్యుత్‌ ఎపుడూ అత్యల్ప నిరోధం(lowest electrical resistance) ఉన్న దారిగుండా ప్రయాణిస్తుంది. మొత్తం బోగీ ప్రధానంగా లోహం కాబట్టి మనతో సంబంధంలేకుండా విద్యుత్‌ ప్రవాహం పైనున్న తీగ నుంచి యంత్రం గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. రైల్లో ఉన్నపుడు మన శరీరం ఎపుడూ ఏమాత్రం రెండు వేర్వేరు శక్మాలున్న ధృవాల మధ్య ఉండదు. కాబట్టి విద్యుత్‌ ప్రవా...

విశ్వం గురించి కొన్ని నిజాలు - అపోహలు The Universe

Image
విశ్వం గురించిన అపోహలు =============== ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందక ముందు కొన్ని అపోహలు ఉండేవి. అవి ఇపుడు తొలగి పోయాయి. కానీ ఇంకా కొందరు ఆజ్ఞానం తోనో లేక అహం తోనో లేక ఆ అజ్ఞానం చెప్పిన వారు మన మున్ముత్తాతవ్వలు అనే మోహం తోనో ఆ అపోహలను తొలగించుకోలేక పోతున్నారు. వాటిలో కొన్నిటిని,వాటికి విరుగుడులను, క్రింద ఇస్తున్నాను. 1. విశ్వం ముందు లేదని, ఎవరో వచ్చి దానిని సృష్టించారని కొందరు ఊహించారు.  అది వైజ్ఞానిక పరిశీలన లో తప్పు అని తేలిపోయింది. విశ్వం లో ఏది కూడా సృష్టి కాదు, ఏదయినా సరే, ఉన్నదాని యొక్క పరిణామమే. విశ్వం స్వతఃసిద్ధం, స్వయంచలితం. దీనిని ఎవరూ పుట్టించ నవసరం లేదు. ఎవరూ నాశం చేయ శక్యులు కాదు. విశ్వం లో జరిగే ప్రతి సంఘటనకు, ముందు ఉంది, వెనుకా ఉంది. ముందు వెనుక లేని సంఘటన ఏది లేదు. ఏ సంఘటన జరిగినా ఉన్న దానితోనే జరుగుతోంది. ఉన్నదాని నుంచే సంఘటన జరుగుతుంది, దాని నుంచి ఉన్నదే వస్తున్నది. లేని దాని నుంచి ఏది రావటం కానీ, ఉన్నది ఉరువు లేకుండా పోవడం కానీ జరగదు. కనుక సృష్టి అనేది అబద్దం. 2. విశ్వాన్ని పుట్టించక పోయినా, ఎవరో ఏదో ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి, దాని నియమాలను నిర్ణయిం...

స్టీవ్ జాబ్స్ జీవిత పాఠం, Words of Steve jobs about life.

Image
స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు: పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.  నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే జీవితం. అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది. 30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా..  అందులో తేడా ఏమీ వుండదు. ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూర...

మనిషి పుట్టిన వెంటనే ఎందుకు మాట్లాడడు???

Image
మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు? శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి.  అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు. ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.

ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు దీనిలో అర్ధమేంటో???

Image
ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు దీనిలో అర్ధమేంటో??? అనగనగనగా ఒక కోటలో ఓ రాజు ఉండేవాడు. అందరు రాజులకు మల్లే వేట అంటే అతడికి మహాపిచ్చి.వేటకు చిక్కి బలయ్యే జంతువుల మాంసమంటే పిచ్చి పిచ్చి ఆ రాజుకి. ఒక రోజు కోట దాటి రాజ్యం పొలిమేరల్లో ఉండే మహారణ్యంలోకి వేటకు వెళ్లాడుబంధుమిత్రులు, సైన్య సపరివార సమేతం రాజుకు తోడు ఉన్నారనుకోండి. రాజు భయపడాల్సిన పనిలేదు మరి. ఓపిక ఉన్నంత వరకూ వేటాడారు. అదేం ఖర్మో గాని ఆరోజు రాజు వేట పారలేదు. ఎంతదూరం పోయినా జంతువు అలికిడి లేదు. పక్షుల జాడలేదు.తిరిగారు తిరిగారు తిరిగారు.. తిరిగి అలసిపోయారు. ఉన్నట్లుండి సింహం అరుపు వినబడింది. రాజుకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. కాని రాజు కూర్చున్న గుర్రానికి మాత్రం పై ప్రాణం పైనే ఎగిరిపోయినట్లయింది. అక్కడే ఉంటే ఈ రోజుతోటే భూమ్మీద తనకు నూకలు చెల్లిపోతాయనుకుందేమో..ఒక్కసారిగా లంఘించి ముందుకురికింది. అందరూ చూస్తుండగానే రాజుతో పాటు కనుమరుగయిపోయింది. రాజభటులు తెప్పరిల్లి వెతికితే..గుర్రమూ లేదు... రాజూ లేడు...వేటమాని అడివంతా రాజుకోసం గాలించడం వారి పనయింది. తోవతప్పిన రాజు గుర్రమెటు తిరిగితే అటు పోతున్నాడు.పాపం. రాజు కదా.. దారి ...

పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?

Image
పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి? చలికాలంలో రాత్రివేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము. చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు.

గ్రీన్‌కార్డులకు దేశాల వారీ పరిమితి ఎత్తివేత, వేలాది మంది భారతీయులకు శుభ పరిణామం...!!!

Image
గ్రీన్‌కార్డులకు దేశాల వారీ పరిమితి ఎత్తివేత 1) హెచ్‌1బీ కుటుంబీకులూ పని చేసుకోవచ్చు. 2) గ్రీన్‌కార్డు పొందేందుకు రోడ్‌మ్యాప్‌. 3) వేలాది మంది భారతీయులకు తీపికబురు. అమెరికా వెళ్లి సెటిలవుదామనుకున్నా, చదువుకుందామనుకున్నా ఇక ఎంత మాత్రం ఇబ్బంది లేదు. ఆంక్షలు, చెకింగ్స్‌, బలవంతపు పంపేయడాలు,కాళ్లకు బంధనాలు,కోర్టు కేసులు, డిటెన్షన్‌ సెంటర్లలో నిర్బంధాలు... వీటన్నింటికీ ఇక స్వస్తి!! నాలుగు రాళ్లు సంపాదించుకోడానికో, లేక మక్కువ తోనో అక్కడికి వెళ్లి ఉందామనుకున్న వేలాది మంది భారతీయులకు కొత్త ప్రభుత్వం ఓ తీపికబురు అందించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరించిన కఠినమైన వలస విధానాన్ని పక్కన పడేసి ఓ సమగ్ర సంస్కరణ బిల్లును సిద్ధం చేసింది.  దీని పేరు: యూఎస్‌ సిటిజన్‌షిప్‌ ఏక్ట్‌-2021.  అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే జో బైడెన్‌ ఈ బిల్లుపై సంతకం చేసి కాంగ్రె‌స్‌‌కు పంపారు.అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా పంపేసే పనిని ఓ 60-రోజుల పాటు- అంటే మార్చి 21దాకా నిలిపేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.ఒక్క హెచ్‌-1బీ వీసాదారులే కాదు,వారి కుటుంబీ కులకూ,డిపెండెంట్స్‌ అందరికీ ఈ బిల్లు పెద్ద ఊర...

సుడి గుండాలు, వాయు గుండాలు ఎలా ఏర్పడతాయి? Vortex on earth and sea

Image
సుడి గుండాలు, వాయు గుండాలు ఎలా ఏర్పడతాయి?  శాస్త్రీయంగా చూస్తే సుడి గుండాలు, వాయు గుండాలు ఒకే దృగ్విషయానికి చెందిన అంశాలు. సాధారణ పరిభాషలో సుడిగుండాలంటే చెరువులు, సముద్రాలు, ఆనకట్టల నీళ్లలో ఏర్పడే సుడులు. గాలిలో ఏర్పడే ఇలాంటి సుడుల్నే వాయు గుండాలు లేదా సుడి గాలులు అంటుంటారు.  వాయువులయినా, నీరయినా ఇతర ద్రవాలయినా అవి ఒక చోట స్థిరంగా ఉండకుండా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రవాహకాలు అంటాం. అవి ప్రవహించేటప్పుడు వాటిలోని అన్ని పదార్థ భాగాలు ఒకే వేగంలో కదలవు. ఆ ప్రవాహకాల్లో ఉన్న అణువులు, కణాలు, తేలికపాటి శకలాలు పరస్పరం అడ్డుపడుతుంటాయి. తద్వారా ప్రవాహకంలో అన్ని ప్రాంతాలు ఒకే వేగంతో కాకుండా కొన్ని పొరలు వేగంగా మరికొన్ని పొరలు మెల్లగా కదులుతాయి. ఇలా సంభవించే అంతర్గత ఘర్షణ వల్ల కలిగే వేగాల తేడాను స్నిగ్ధత అంటాం. నీటిలో గానీ, వాయువుల్లో గానీ, మరే ఇతర ప్రవాహకాలలో గానీ ఉష్ణోగ్రతా తేడాలు ఉన్నట్లయితే అవి సాంద్రతల్లో తేడాలకు దారి తీస్తాయి. పదార్థాలు అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపునకు ప్రవహించడం సహజం. ఆ క్రమంలో వేర్వేరు దిశల్లో స్నిగ్ధతలు వేరు వేరుగా ఉన్నట్లయితే సుడి గుం...

నాన్న అంటే ఎవరు??? Who is he(Father)???

  *నాన్న అంటే ఎవరు??* *బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.* *“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.* *“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.* *దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.* *“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.* *“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.* *మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.* *అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతి...

Highlights of *Union Budget 2021-22*.

Image
Highlights of *Union Budget 2021-22*. *General* 1. First digital Budget in the history of India 2. Vehicle Scrapping Policy. Vehicle Fitness Test after 20 years in case of Personal vehicle and 15 years in case of commercial vehicles 3. 64,180 crores allocated for New Health Schemes 4. 35,000 crores allocated for Covid Vaccine 5. 7 Mega Textile Investment parks will be launched in 3 years 6. 5.54 lakh crore provided for Capital Expenditure 7. 1.18 lakh crore for Ministry of Roads 8. 1.10 lakh crore allocated to Railways 9. Proposal to amend Insurance Act. Proposal to increase FDI from 49% to 74 %.  10. Deposit Insurance cover (DICGC Act 1961 to be amended). Easy and time bound access of deposits to help depositors of stress banks. 11. Proposal to revive definition of ‘Small Companies’ under Companies Act 2013. Capital  less than 2 Cr. and Turnover Less than 20 Cr. 12. Disinvestment: IPO of LIC, Announced Disinvestment of Companies will be completed in FY 2021-22 *Direct and Ind...

ఇక (100) వంద రూపాయల నోటు లేనట్లేనా RBI Desition

Image
ఇక (100) వంద రూపాయల నోటు లేనట్లేనా!!! పాత తరం 100 రూపాయల నోట్లకు  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI  ) ఈ సంవత్సరం ( 2021) లో సెలవు పలకనుంది . దేశవ్యాప్తంగా కొత్త 100 నోట్లను వాడకంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే,పాత నోట్లకు స్వస్తిచెప్పాలని నిర్వహించినట్లు RBI ఈ రోజు ప్రకటించింది. మంగళూరు( కర్ణాటక ) లోని దక్షిణ కన్నడ జిల్లా పంచాయతీ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకింగ్ సెక్యూరిటీ కమిటీ క్యాష్ మేనేజ్మెంట్ సబేలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో  RBI అసిస్టెంట్ జనరల్ మేనేజర్  B N మహేష్  పాల్గొన్నారు . గత 6 సంవత్సరాలుగా పాత 100 నోట్లను ముద్రించడం లేదని , దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన మిలియన్ రూపాయల 100 నోట్లను బయటకు తెచ్చే ఉద్దేశంతోనే  ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు . ఎంత డబ్బు కలిగివున్నా మార్చి నెలాఖరు నాటికి అన్ని బ్యాంకులు పాత 100 నోట్లను జమ చేసుకుని , కొత్త 100నోట్లను కస్టమర్లను అందిస్తామని ఆయన అన్నారు .

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్

  *బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..* *రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు* *2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు* *జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు* *కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల,400 కోట్లు* *మెగా ఇన్వెస్ట్‌మెంట్‌  టెక్స్‌టైల్‌ పార్క్‌* *కొత్తగా బీఎస్‌ఎల్‌-3  ప్రయోగశాలలు 9 ఏర్పాటు* *వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి*  *పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం* *వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ* *64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ :  రైతుల ఆదాయం రెట్టింపులక్ష్యం* *6 సంవత్సరాలకు గాను  64వేల 180కోట్లరూపాయలతో  ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం* *నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు* *ఆరోగ్య రంగానికి పెద్దపీట*   *100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం* *కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం* *ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం* *ప్రధాని మోదీ హయాంల...